కలెక్టర్లతో సీఎం రేవంత్ రివ్యూ

18
- Advertisement -

కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. హైదరాబాద్ సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలపై చర్చించనున్నారు.కలెక్టర్లతో పాటు మంత్రులు, సీఎస్, ప్రభుత్వ సలహాదారులు, పోలీసు కమిషనర్లు, ఎస్సీలు, శాఖల డైరెక్టర్లు, కమిషనర్లు పాల్గొన్నారు.

ప్రధానంగా ప్రజాపాలన, మహిళా శక్తి, విద్య, శాంతిభద్రతలు, మత్తు పదార్థాలు, ధరణి ఫ్యూచర్, ఖరీఫ్ సాగు, వైద్యం, విష జ్వరాలు, ఆరోగ్యం, వనమహోత్సవంపై సమీక్ష జరపనున్నారు రేవంత్. ఆరు గ్యారెంటీల పథకాల అమలు ఎలా ఉంది? రైతుల సమస్యలేంటి? ధరణితో ఇబ్బందులేంటి? ఎలా పరిష్కరించాలి? అనేదానిపై చర్చ జరగనుంది.

వర్షాల వల్ల విష జ్వరాలు ప్రబలుతుండటంతో పారిశుధ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలనీ, ఎప్పటికప్పుడు చెత్తను తొలగించాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వనున్నారు రేవంత్. ముఖ్యంగా డ్రగ్స్ మహమ్మారిని రాష్ట్రం నుండి పారదోలాలనే కృత నిశ్చయంతో ఉన్నారు రేవంత్. ఇప్పటికే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వగా ఇవాళ సమావేశంలో పలు సూచనలు చేయనున్నారు.

Also Read:Dandruff:డాండ్రఫ్‌కి వీటితో చెక్‌..!

- Advertisement -