- Advertisement -
ఫ్యూచర్ సిటీ, శామీర్‌పేట్, మేడ్చల్ మెట్రో మార్గాలకు సంబంధించిన సమగ్ర వివరణాత్మక ప్రణాళికలు (డీపీఆర్ లు) మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
మూడు మెట్రోల డీపీఆర్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం పొంది ఏప్రిల్ నెలాఖరుకు టెండర్లు పిలవాలని సీఎం సూచించారు. హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరణ, రేడియల్ రోడ్ల నిర్మాణాలు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాలపై తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు.
Also Read:తెలంగాణలో షేక్ హ్యాండ్స్ వద్దు!
- Advertisement -