యువ శాస్త్రవేత్త కుటుంబానికి సీఎం పరామర్శ

7
- Advertisement -

వరదల్లో కొట్టుకుపోయి.. దుర్మరణం పాలైన వ్యవసాయ శాస్త్రవేత్త అశ్విని కుటుంబాన్ని పరామర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలోని జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్‌లో విధులు నిర్వహిస్తున్నారు ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గంగారం తండాకు చెందిన నునావత్ అశ్విని శాస్త్రవేత్త .

ఛత్తీస్‌ఘడ్‌లోని రాయ్‌పూర్‌లో జరిగే ఓ సదస్సులో పాల్గొనేందుకు తండ్రి మోతీలాల్‌తో కలిసి కారులో ఆదివారం బయలుదేరారు అశ్విని. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమయ్య గూడెం వద్ద వంతెనపై ఆకేరువాగు ప్రవాహానికి కొట్టుకుపోయింది కారు. అశ్వినితో పాటు ఆమె తండ్రి మృతి చెందారు.

Also Read:భారీ వర్షాలు..ఎన్టీఆర్ సాయం

- Advertisement -