ఒక్క ఏడాదిలో …54 వేల కోట్ల రూపాయలతో…రైతుల జీవితాల్లో పండగ తెచ్చాం అన్నారు రేవంత్. ఇది నెంబర్ కాదు…రైతులు మాపై పెట్టుకున్న నమ్మకం నిలబెట్టుకున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
ఈ సంతోష సమయంలో అన్నదాతలతో కలిసి రైతు పండుగలో పాలు పంచుకోవడానికి ఉమ్మడి పాలమూరుకు వస్తున్నా అని ఎక్స్ వేదికగా ఆనందాన్ని పంచుకున్నారు తెలంగాణ సీఎం.
ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు…పొలానికి వెళ్లి అరక కట్టాల్సిన రైతు…పోలింగ్ బూతుకు వెళ్లి “మార్పు” కోసం ఓటేశాడు…ఆ ఓటు అభయహస్తమై…రైతన్న చరిత్రను తిరగరాసిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎక్స్ వేదికగా ట్వీట్ చేసిన రేవంత్ రెడ్డి…ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ…రూ.7,625 కోట్ల రైతు భరోసా…ధాన్యానికి క్వింటాల్ కు రూ.500 బోనస్…రూ.10,444 కోట్ల ఉచిత విద్యుత్…రూ.1433 కోట్ల రైతుబీమా…రూ.95 కోట్ల పంట నష్ట పరిహారం…రూ.10,547 కోట్ల ధాన్యం కొనుగోళ్లు చేపట్టామన్నారు.
ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు…
పొలానికి వెళ్లి అరక కట్టాల్సిన రైతు…
పోలింగ్ బూతుకు వెళ్లి “మార్పు” కోసం ఓటేశాడు.
ఆ ఓటు అభయహస్తమై…
రైతన్న చరిత్రను తిరగరాసింది.ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ…
రూ.7,625 కోట్ల రైతు భరోసా…
ధాన్యానికి క్వింటాల్ కు రూ.500 బోనస్…
రూ.10,444 కోట్ల ఉచిత…— Revanth Reddy (@revanth_anumula) November 30, 2024
Also Read:వెల్నెస్ రిట్రీట్‌కు కేటీఆర్