సీఎం పర్యటన…రైతుల అరెస్ట్

8
- Advertisement -

ముఖ్యమంత్రి జహీరాబాద్ పర్యటన సందర్భంగా రైతులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ముఖ్యమంత్రి పర్యటన జరిగిన ప్రతిసారీ ముందస్తు అరెస్టులు, నిర్బంధాలు ఎందుకు? ఇదేనా ప్రజాపాలన అంటే? చెప్పాలన్నారు.

మొన్న నాగర్‌కర్నూల్‌ పర్యటనలో చెంచు సోదరులను అక్రమంగా అరెస్టు చేశారు. నేడు జహీరాబాద్‌లో రైతులను, రైతు నాయకులను అరెస్టు చేశారు.జహీరాబాద్ నిమ్స్ చుట్టూ ఉన్న గ్రామాలను అష్టదిగ్బంధనం చేసి, రైతు నాయకులను నిర్బంధించడం ఏ విధంగా ప్రజాపాలన అవుతుంది? ఇది ప్రజాపాలన కాదు, ప్రజలను పీడించే పాలన అన్నారు.

ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికీ తన ఆవేదనను వ్యక్తపరిచే స్వేచ్ఛ ఉంది. ఈ హక్కును హరించడం దుర్మార్గం. నిర్బంధాలు, కంచెలు, ఆంక్షలు, అరెస్టులు లేకుండా ముఖ్యమంత్రి పర్యటన జరిగే పరిస్థితి లేదు…అక్రమంగా అరెస్టు చేసిన రైతులను, రైతు నాయకులను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ డీజీపీ ని డిమాండ్ చేస్తున్నాం అన్నారు.

Also Read;మోడీతో కలిసి పనిచేస్తా: రేవంత్

- Advertisement -