- Advertisement -
రాష్ట్రంలోని 63 లక్షల మంది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (#SERP) ద్వారా ఉచితంగా పంపిణీ చేయనున్న చీరల నమూనాలను అసెంబ్లీలోని తన చాంబర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు.
మహిళా సంఘాల సభ్యులకు రాష్ట్ర చేనేత సహకార సంఘం (#TGSCO) ద్వారా తయారు చేయించి ఏడాదికి రెండు చీరల చొప్పున ఉచితంగా పంపిణీ చేయాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయించగా, వాటి నమూనాలను సీఎం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ తో పాటు పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఉన్నారు.
Also Read:పాఠాలు వినాల్సిన పిల్లలు..ఆస్పత్రుల్లో: హరీశ్ రావు
- Advertisement -