- Advertisement -
ఉచిత బస్సు పథకం ద్వారా ఒక్కో మహిళకు దాదాపు రూ.5000 వరకు ఆదా అవుతోంది అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వి హబ్ వుమెన్స్ యాక్సిలరేషన్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి అంబానీ, అదానీల బిజినెస్‌తో తెలంగాణ మహిళల పోటీ అన్నారు.
పెట్రోల్ వ్యాపారం అంటే అంబానీ .. సోలార్ పవర్ అంటే అదానీ గుర్తొస్తారు, వాళ్లతో పోటీ పడే విధంగా పెట్రోల్ బంకులు, సోలార్ పవర్ ప్లాంట్లు మహిళలు నెలకొల్పేలా ప్రభుత్వ ప్రోత్సహిస్తోంది అన్నారు.
మా ఎమ్మెల్యే ఓటు వేయకపోయినా గెలుస్తా … మహిళా సంఘాల్లో 67 లక్షల మంది సభ్యులున్నారు. వాళ్లు కోటి మంది కావాలి అన్నారు.రాష్ట్రంలో ఉన్న కోటి మంది మహిళలు ఎవరికి ఓటు వేస్తే వాళ్లు గెలుస్తారు…. మా వాళ్లు ఓటు వేయకపోయినా మీ కోటి మంది మహిళలు అనుకుంటే ప్రభుత్వాన్ని నిర్ణయించగలరు అన్నారు.
Also Read:TG:రాష్ట్రంలో మూడు రోజులు వర్షాలు
- Advertisement -

