జులై నెలలో హైదరాబాద్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (WEF) ఫాలో అప్ సదస్సు నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వేదికపై ఆయన ఈ కీలక ప్రతిపాదనను ఉంచారు. దావోస్‌లో జరిగిన సమావేశాల్లో తెలంగాణ పెట్టుబడి అవకాశాలు, పారిశ్రామిక విధానాలు, మౌలిక వసతులు, నైపుణ్యాభివృద్ధిపై సీఎం ప్రత్యేకంగా వివరించారు.
WEF ఆధ్వర్యంలో నిర్వహించిన “జాయిన్ ది రైజ్” కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర విజన్‌ను ప్రపంచానికి ప్రదర్శించారు. ఐటీ, ఫార్మా, గ్రీన్ ఎనర్జీ, లాజిస్టిక్స్, డిజిటల్ ఎకానమీ రంగాల్లో తెలంగాణ సాధించిన ప్రగతిని సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. భవిష్యత్తులో హైదరాబాద్‌ను గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. తెలంగాణలో సినీ పరిశ్రమ అభివృద్ధి, క్రియేటివ్ ఎకానమీ అవకాశాలపై ఆయన మాట్లాడారు. ప్రపంచస్థాయి వేదికపై తెలంగాణ సంస్కృతి, ప్రతిభ, వ్యాపార అవకాశాలు ప్రతిబింబించడం గర్వకారణమని చిరంజీవి అన్నారు.హైదరాబాద్‌లో WEF ఫాలో అప్ సదస్సు జరిగితే అంతర్జాతీయ పెట్టుబడులు మరింతగా ఆకర్షించవచ్చని, గ్లోబల్ కంపెనీలతో ప్రత్యక్ష భాగస్వామ్యాలు పెరుగుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read:‘నారీ నారీ నడుమ మురారి’..ఆనందాన్ని ఇచ్చింది

