తెలంగాణ అభివృద్ధి కోసం మోడీతో కలిసి పనిచేస్తానని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటాం.. నరేంద్ర మోదీని ఒక్కసారి కాదు 50 సార్లు అయినా కలుస్తాం. మనకు రావాల్సిన నిధులు తెచ్చుకుంటాం అన్నారు. ఎవరేమి అనుకున్నా తనకేం ఇబ్బంది లేదని తెలిపారు.
సంగారెడ్డి జిల్లాలోని పస్తాపూర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన రేవంత్… ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు.. ఎన్నికల తర్వాత అభివృద్ధి చేయడమే నా లక్ష్యం అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించుకున్నప్పుడే.. కలిసి మెలిసి పని చేసినప్పుడే రాష్ట్రాభివృద్ధి జరుగుతుంది అన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మా మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ వరకు మన వాళ్లను గెలిపించుకోవడానికి నా శాయశక్తులా కష్టపడతానని చెప్పారు.
సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే రాష్ట్రానికి ఆదాయం రావాలి.. రాష్ట్రానికి ఆదాయం పెరగాలంటే ఐటీ, ఫార్మా ఇండస్ట్రీస్ తో పాటు ఇండస్ట్రియల్ పార్కులు రావాలి అన్నారు. ఇవాళ అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పాఠశాలల అన్నీ కూడా ఆడబిడ్డలే నడిపించే విధంగా పాఠశాలల పెత్తనం ఇచ్చాం అన్నారు.
Also Read:ఈ టిప్స్‌తో ఈజీగా బరువు తగ్గండి..

