CM Revanth:అభివృద్ధి నిరంతర ప్రక్రియ

9
- Advertisement -

కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. MSME పాలసీ – 2024 ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్..మంచి పనులు ఎవరు చేసినా వాటిని కొనసాగించడానికి మాకు అభ్యంతరం లేదు అన్నారు.రాష్ట్ర ప్రయోజనానికి విఘాతం కలిగించే అంశాలను తొలగించేందుకు మా ప్రభుత్వం వెనక్కు తగ్గదు..ప్రస్తుతం చదివిన చదువుకు, పారిశ్రామిక అవసరాలకు మధ్య అంతరం ఏర్పడిందన్నారు.

అందుకే రాష్ట్రంలోని 65 ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చాం అన్నారు. టాటా ఇనిస్టిట్యూట్ తో కలిసి సంయుక్తంగా రూ. 2400 కోట్లతో ఆధునీకరిస్తున్నాం…రాష్ట్ర సంపదను పెంపొందించాలనే MSME పాలసీ-2024 ను ఆవిష్కరించాం అన్నారు.

సూక్ష్మ,చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు మంత్రి శ్రీధర్ బాబు గొప్ప ఆలోచన చేయడం అభినందనీయం అని తెలిపిన రేవంత్..పాలసీ డాక్యుమెంట్ లేకుండా ఏ రాష్ట్రం అభివృద్ధి సాధించదు అన్నారు.గత ప్రభుత్వ విధానాలను కొనసాగిస్తూనే…కొత్త పాలసీని ముందుకు తీసుకెళతాం..ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ….అభివృద్ధి విషయంలో ఎలాంటి రాజకీయాలు లేవు అన్నారు.

యూనివర్సిటీ నిర్వహణకు పారిశ్రామిక వేత్తలు నుంచి రూ.300 కోట్ల నుంచి రూ.500 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయబోతున్నాం అని తెలిపిన రేవంత్..వీటిని యూనివర్సిటీ నిర్వహణకు ఖర్చు చేసేలా ప్రభుత్వం విధి విధానాలు ఖరారు చేసిందన్నారు. హైదరాబాద్ లో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయబోతున్నాం….ఫ్యూచర్ సిటీలో లైఫ్ సైన్సెస్, గ్రీన్ ఫార్మా ఏర్పాటు చేస్తామన్నారు.

Also read:ఏడు గ్యారెంటీలతో హర్యానా కాంగ్రెస్ మేనిఫెస్టో

- Advertisement -