జనగామ దళారుల దందాపై రేవంత్ ఫైర్

24
- Advertisement -

అన్నదాతలను మోసం చేసిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు.రైతుల‌ను మోసం చేసిన న‌లుగురు ట్రేడ‌ర్స్ పై క్రిమినల్ కేసులు పెట్టాలని…మార్కెట్ క‌మిటీ కార్యద‌ర్శిని సస్పెండ్ చేయాలని కలెక్ట్‌రి ఆదేశించారు.

తాలు, తేమ పేరుతో ధాన్యం ధ‌ర‌ను త‌గ్గిస్తే సీరియస్‌ యాక్షన్‌ ఉంటుందని…ధాన్యం మద్దతు ధర తగ్గించిన న‌లుగురు ట్రేడ‌ర్స్ పై క్రిమిన‌ల్ కేసులతో పాటు దళారుల‌కు స‌హ‌క‌రించిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ళ విష‌యంలో అధికారులు అప్రమ‌త్తంగా ఉండాల‌ని మ‌ద్ధతు ధ‌ర విష‌యంలో రైతులకు అన్యాయం జ‌ర‌గ‌కుండా చూడాలని సూచించారు.

యాసంగి పంట మ‌ద్ధతు ధర‌ క్వింటాలు వ‌రి ధాన్యానికి 2వేల 203 రూపాయ‌ల ధ‌ర‌ను నిర్ణయించింది. అయితే మ‌ద్ధతు ధర ఇవ్వకుండా.. కొంద‌రు ద‌ళారులు రైతుల‌ను నిండా ముంచుతున్నారు. క్వింటాలు ధాన్యం ధ‌ర‌ను 1550, 1569 రూపాయ‌లుగా నిర్ణయించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రేవంత్…వారిపై చర్యలకు ఆదేశించారు.

Also Read:Gold Rate:మళ్లీ పెరిగిన బంగారం ధరలు

- Advertisement -