రేవంత్ మాట్లాడేవన్ని అబద్దాలే!

3
- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డి కి గిరిజన ఆదీవాసీల పై ప్రేమ ఉంటే వారి మంత్రిత్వ శాఖ ను గిరిజన ఆదివాసీలకు ఎందుకు ఇవ్వడం లేదు అన్నారు ఎమ్మెల్యే కోవాల లక్ష్మీ. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె……సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు అన్నారు. సీఎం చెబుతున్న 24 గంటల కరెంటు వట్టి బోగస్ గా మారింది ..గ్రామాల్లోకి వెళితే కరెంటు పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుంది ..రుణమాఫీ సరిగా జరగలేదు ..రైతు భరోసా ఇంకా పూర్తి చేయలేదు ..ఇందిరమ్మ ఇండ్లు ఎవరికి ఇస్తున్నారు ..తులం బంగారం ఏమైంది ?..పెన్షన్లను పెంచుతాం అని ఎందుకు పెంచలేదు ..కేసీఆర్ కిట్ ,న్యూట్రిషన్ కిట్ ఎందుకు బంద్ చేశారు..అన్ని వర్గాలను మోసం చేశారు ..అబద్దపు హామీలు యిచ్చి అధికారం లోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ..ప్రజలే ముందుకు వచ్చి సీఎం రేవంత్ రెడ్డి ని తిడుతున్నారు అన్నారు.

ఇంద్రవెళ్లి లో 1981 లో ఆదివాసీలను పొట్టన పెట్టుకుంది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమే..గిరిజన ,ఆదీవాసీలకు ఏదైనా మేలు జరిగింది అంటే అది కేసీఆర్ ప్రభుత్వం లోనే ..కొమురం భీం పేరిట జిల్లా ను ఏర్పాటు చేసింది కేసీఆర్ యే ..బంజారా భవన్ ,ఆదీవాసీ భవన్ లను కేసీఆర్ హయం లోనే నిర్మించాం,ఆదీవాసీ ,గిరిజన సంస్కృతి కి ఆదరణ కల్పించేందుకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది కేసీఆర్ ప్రభుత్వమే ..సీఎం లేని పోనీ మాటలు మాట్లాడితే గిరిజన ఆదివాసీలు నమ్మే పరిస్థితి లేదు ..గిరి వికాసం పేరు ను మార్చి తానే ఏదో చేశానని సీఎం రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నారు ..కేసీఆర్ హయం లో గిరిజన ఆదీవాసీలకు ఇచ్చిన పట్టాలనే రేవంత్ రెడ్డి ఇస్తున్నారు ..చేతనైతే కొత్తగా ఇవ్వండి …ఆదీవాసీ గూడేలు ,గిరిజన తండాల్లో రోడ్లు పాడైతే బాగు చేసే పరిస్థితి లేదు అన్నారు.

కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్సీ ,ఎస్టీ స్థానాలను ఎక్కువగా గెలుచుకుందన్నారు భూక్యా జాన్సన్ నాయక్. గిరిజన ఆదీవాసీ ఓట్ల తోనే కాంగ్రెస్ అధికారం లోకి వచ్చింది ..అధికారం లోకి రాగానే వారి సంక్షేమాన్ని మరిచారు ..గిరిజనులకు ,ఆదివాసీ ఎమ్మెల్యేలు ఉండగా వారి మంత్రిత్వ శాఖను సీఎం తనవద్దే ఎందుకు ఉంచుకుంటున్నారు ?…ప్రజల విశ్వాసాన్ని సీఎం రేవంత్ కోల్పోయారు ..ఇంకా మూడేళ్లకు పైగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎలా భరించాలి అని ప్రజలు మధన పడుతున్నారు ..గిరిజన ఆదివాసీలు ఈ సారి కాంగ్రెస్ కు గట్టి గుణపాఠం చెప్పడం ఖాయం అన్నారు.

Also Read:BRS:రజతోత్సవ వేడుకలకు డల్లాస్ సిద్ధం

- Advertisement -