తెలంగాణ మణిహారం రీజినల్ రింగ్ రోడ్ (#RRR) కు సంబంధించి భూసేకరణ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆర్ఆర్ఆర్ నిర్మాణంలో అటవీశాఖ పరిధిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ఇందుకోసం అటవీ – ఆర్ అండ్ బీ శాఖలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని, రెండు శాఖల్లో ఒక్కో అధికారిని ప్రత్యేకంగా నియమించుకోవాలని చెప్పారు.
నాగ్‌పూర్-విజయవాడ కారిడార్‌కు సంబంధించి తెలంగాణ జిల్లాల్లో అసంపూర్తిగా మిగిలిన భూసేకరణ ప్రక్రియను సంక్రాంతిలోగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రాలకు కచ్చితంగా బీటీ రోడ్లు ఉండాల్సిందేనని, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా వీలైనంత వెడల్పు ఉండే విధంగా డిజైన్ చేయాలన్నారు. ఇందుకు సంబంధించి విడతల వారీగా నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
Also Read:కేటీఆర్ కలిసిన వండర్ బేబీ ఉపాసన