ప్ర‌జావ‌స‌రాలకు అనుగుణంగా లింక్ రోడ్లు….

5
- Advertisement -

హైద‌రాబాద్ న‌గ‌రంలో ప్ర‌జావస‌రాల‌కు అనుగుణంగా అనుసంధాన (లింక్‌) రోడ్ల నిర్మాణం చేప‌ట్టాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. రాజ‌ధాని న‌గ‌రంతో పాటు హెచ్ఎండీఏ ప‌రిధిలో హైద‌రాబాద్ రోడ్డు డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ (హెచ్ఆర్‌డీసీఎల్‌) ఆధ్వ‌ర్యంలో చేప‌డుతున్న అనుసంధాన ర‌హ‌దారుల నిర్మాణం, విస్త‌ర‌ణ‌పై ఐసీసీసీలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా 49 రోడ్ల నిర్మాణం, విస్త‌ర‌ణ‌పై ముఖ్య‌మంత్రి ప‌లు సూచ‌న‌లు చేశారు. వివిధ ప్రాంతాల మ‌ధ్య అనుసంధాన‌త పెంచ‌డం, ప్ర‌జ‌లు ఎటువంటి అవాంత‌రాలు లేకుండా రాక‌పోక‌లు సాగించేందుకు వీలుగా ర‌హ‌దారుల నిర్మాణం ఉండాల‌ని సీఎం ఆదేశించారు. ఈ క్ర‌మంలో విశాల ప్ర‌జా ప్ర‌యోజ‌నాల‌ను దృష్టిలో ఉంచుకోవాల‌ని సీఎం అన్నారు. అనుసంధాన ర‌హ‌దారుల నిర్మాణం, ప్ర‌స్తుతం ఉన్న ర‌హ‌దారుల విస్త‌ర‌ణ విష‌యంలో భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌ను దృష్టిలో పెట్టుకోవాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌కు సూచించారు.

ఆయా ర‌హ‌దారుల నిర్మాణంతో ప్ర‌యాణికుల ఇబ్బందులు తొల‌గిపోవ‌డంతో పాటు వారికి స‌మ‌యం క‌లిసి వ‌చ్చేలా ఉండాల‌ని, ఈ క్ర‌మంలో అద‌న‌పు భూసేక‌ర‌ణ‌కు కొంత అధిక వ్య‌య‌మైనా వెనుకాడ‌వ‌ద్ద‌ని సీఎం రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

Also Read:కీసర గ్రీన్ ఛాలెంజ్‌లో చిన్నారులు

- Advertisement -