గద్దరన్న అంటే ఒక చైతన్యం, ఒక విప్లవం, ఒక వేగుచుక్క అని కొనియాడారు సీఎం రేవంత్ రెడ్డి. గద్దరన్న అవార్డుల కార్యక్రమంలో మాట్లాడిన రేవంత్.. ఆయన స్పూర్తితోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం అన్నారు.
జయజయహే అందించిన అందెశ్రీ, జైబోలో తెలంగాణ అందించిన గద్దరన్న మా అందరికి స్పూర్తి..గద్దర్ ఫిల్మ్ అవార్డులు తీసుకున్న వారందరికీ అభినందనలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధిలో మీరంతా భాగస్వాములు కావాలి అన్నారు.
ప్రభుత్వం కఠినంగా కనిపిస్తుంది కానీ సినీ పరిశ్రమ అభివృద్ధికి ఎల్లవేళలా సహకారం అందిస్తుంది అన్నారు. ప్రభుత్వం నడిపేటప్పుడు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నా అది మీ మంచికే….2047 నాటికి మన భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు పూర్తవుతుంది అన్నారు. మన దేశం 2047 నాటికి ప్రపంచంలోనే ఒక అద్భుతమైన దేశంగా డెవలప్ అవ్వాలి…ప్రపంచ ఎకానమీని ఇండియా శాసించే విధంగా అభివృద్ధి చెందాలి అన్నారు.
గద్దర్ ఫౌండేషన్ కు రూ.3 కోట్లు మంజూరు చేశారు రేవంత్. సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు చెప్పారు గద్దర్ తనయుడు సూర్య కిరణ్.
Also Read:ఘనంగా గద్దర్ అవార్డ్స్…ప్రధానోత్సవం

