యూనివర్సిటీలను ప్రక్షాళన చేయాల్సిందే: సీఎం రేవంత్

2
- Advertisement -

రాష్ట్రంలోని యూనివర్సిటీలను నూటికి నూరు శాతం ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని, ఉన్నత విద్యకు సంబంధించి గడిచిన పదేండ్లలో దెబ్బతిన్న వ్యవస్థలను తిరిగి పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత విద్యా మండలికి, వైస్ చాన్సలర్లకు సూచించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఉన్నత విద్యా మండలి చైర్మన్ తో పాటు అన్ని యూనివర్సిటీల వైస్ చాన్సలర్లు ముఖ్యమంత్రి గారితో జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విద్యామండలి, వీసీలకు సీఎం దిశానిర్దేశం చేశారు.

ఎవరి ప్రభావితంతోనో వైఎస్ చాన్సలర్ పోస్టులకు ఎంపిక జరగలేదు. మెరిట్, సామాజిక సమీకరణల ఆధారంగానే ఎంపిక జరిగింది. బాగా పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలన్నారు. కొంతకాలంగా యూనివర్సిటీల పట్ల విశ్వాసం సన్నగిల్లింది. తిరిగి వర్సిటీల గౌరవం పెంచే దిశగా పని చేయాలని…యూనివర్సిటీలను 100 శాతం ప్రక్షాళన చేయాలి. గతంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లను విద్యార్థులు యేళ్ల తరబడి గుర్తు పెట్టుకునేవాళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అన్నారు.

యూనివర్సిటీ ప్రస్తుత పరిస్థితులపై సమగ్ర అధ్యయనం చేసి ప్రమాణాలను పెంచే చర్యలు మొదలు పెట్టాలి. అవసరమైతే కన్సల్టెన్సీలను ఏర్పాటు చేసుకొని నివేదిక తయారు చేసుకోవాలి. వ్యవస్థల పునరుద్ధరణకు ఏం చేయాలో అధ్యయనం చేయాలన్నారు. మంచి పని చేయడానికి వైస్ ఛాన్సలర్లకి స్వేచ్ఛ ఉంటుంది. ప్రభుత్వ సహకారం ఉంటుంది. తప్పు జరిగితే ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకోవాల్సివస్తుందన్నారు. యూనివర్సిటీల్లో డ్రగ్స్, గంజాయి విక్రయాలపైన దృష్టి సారించాలి. అలాంటి విద్యార్థులను గమనించి కౌన్సెలింగ్ ఇవ్వాలన్నారు.

Also Read:సంక్రాంతి రేసులో వెంకీ!

- Advertisement -