శాంతిభద్రతల విషయంలో రాజీ పడేది లేదు: రేవంత్

2
- Advertisement -

సినీ పరిశ్రమకు అండగా ఉంటామనే ఇండస్ట్రీ పెద్దలకు సీఎం క్లియర్ మెసేజ్ ఇచ్చారు. శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వం రాజీపడేది లేదన్నారు. హీరోల ప్రభావం సమాజంపై అధికంగా ఉంటుందని, సొసైటీకి ఆదర్శంగా వారి ప్రవర్తన ఉండాలని సూచించారు. ప్రభుత్వాన్ని కలిసే అవకాశం ఇచ్చినందుకు నిర్మాత అల్లు అరవింద్ సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. సంధ్య థియేటర్ లాంటి ఘటన మరోసారి జరగకుండా చూసుకుంటామన్నారు.

సినిమా పరిశ్రమ సమస్యలను మా దృష్టికి తీసుకువచ్చారన్నారు. అనుమానాలు, అపోహలు, ఆలోచనలను పంచుకున్నారు. 8 సినిమా లకు మా ప్రభుత్వం స్పెషల్ జీవో లు ఇచ్చాం అన్నారు. పుష్ప సినిమా కు పోలీస్ గ్రౌండ్ ఇచ్చాం, తెలుగు సినిమా పరిశ్రమ కు ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం అన్నారు. పరిశ్రమ బాగుండాలని కోరుకున్నాం…ఐటీ, ఫార్మా తో పాటు మాకు సినిమా పరిశ్రమ మాకు ముఖ్యం అన్నారు.

తెలంగాణ లో అవార్డులు ఇవ్వడం లేదని తెలిసి గద్దర్ అవార్డును ఏర్పాటు చేశాం..ప్రభుత్వం, సినిమా పరిశ్రమ కు మధ్యవర్తి గా ఉండానికి దిల్ రాజు ను ఎఫ్ డిసి ఛైర్మన్ గా నియమించాం అని చెప్పారు రేవంత్.

Also Read:నవ సత్యాగ్రహ బైఠక్‌కి సీఎం రేవంత్ రెడ్డి

- Advertisement -