తెలంగాణకు గుర్తింపు తెచ్చేలా క్రీడా విధానం

1
- Advertisement -

అద్భుతమైన క్రీడాకారులను తీర్చిదిద్దటంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు గుర్తింపు తెచ్చేలా కొత్త క్రీడా విధానం తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. 2036 ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకొని కొత్త పాలసీలో లక్ష్యాలను నిర్దేశించుకోవాలని చెప్పారు.

కొత్త స్పోర్ట్ పాలసీ ముసాయిదాపై ముఖ్యమంత్రి , రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు , ఏపీ జితేందర్ రెడ్డి , తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనా రెడ్డి , ఉన్నతాధికారులతో సమావేశమై సమీక్షించారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వివిధ దేశాలు, ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను ప్రధానంగా చర్చించి పలు సూచనలు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నెలకొల్పనున్న స్పోర్ట్స్ యూనివర్సిటీని యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ గా తీర్చిదిద్దాలన్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తరహాలోనే స్పోర్ట్స్ యూనివర్సిటీని పీపీపీ తరహాలో నిర్వహించాలన్నారు.

ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేసి చైర్మన్‌ను నియమించాలి. యూనివర్సిటీకి స్వయం ప్రతిపత్తి ఉండాలని.. ఈ యూనివర్సిటీలో క్రికెట్, హాకీ, ఫుట్‌బాల్‌, బాస్కెట్ బాల్, స్విమ్మింగ్, టెన్నిస్, బ్యాడ్మింటన్, షూటింగ్, బాక్సింగ్, రెజ్లింగ్, టేబుల్ టెన్నిస్, అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, అక్వాటిక్స్ లాంటి 14 క్రీడలను స్పోర్ట్స్ హబ్‌లో చేర్చాలన్నారు.

Also Read:రేవంత్ మొనగాడు కాదు మోసగాడు: హరీశ్‌ రావు

దాదాపు 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గచ్చిబౌలి స్పోర్ట్స్ స్టేడియం ప్రాంగణంలో స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించాలని తెలిపారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం, హకీంపేట స్పోర్ట్స్ స్కూల్, కోట్ల విజయ భాస్కరరెడ్డి ఇండోర్ స్డేడియం, సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం, ఓయూలోని వెలోడ్రోమ్ ప్రముఖ క్రీడా మైదానాలు, స్టేడియంలు అన్నింటినీ ఒకే గొడుకు కిందకు తెచ్చి స్పోర్ట్ హబ్‌గా మార్చాలని తెలిపారు రేవంత్ రెడ్డి.

- Advertisement -