సింగరేణిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు

3
- Advertisement -

2023-24 ఆర్థిక సంవ‌త్స‌రానికి గాను రాష్ట్ర ప్ర‌భుత్వానికి సింగ‌రేణి కాల‌రీస్ సంస్థ రూ. 88.55 కోట్ల డివిడెండ్‌ను చెల్లించింది. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఈ మేరకు డివిడెండ్ చెక్కును సింగ‌రేణి సీఎండీ బలరాం అందజేశారు.

సింగ‌రేణి కాల‌రీస్ చెల్లింపు మూల ధ‌నం(పెయిడ్ అప్ ఈక్విటీ షేర్ క్యాపిట‌ల్ )లో 10 శాతం డివిడెంట్‌గా చెల్లించాల‌ని నిర్ణ‌యించారు. ఈ మొత్తం సుమారు రూ.173 కోట్లు కాగా.. సింగ‌రేణిలో 51 శాతం వాటా క‌లిగిన రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఇందులో నుంచి రూ.88.55 కోట్ల డివిడెండ్‌ చెల్లించింది.

సింగ‌రేణి సంస్థ ద‌క్షిణ భార‌త దేశ ఇంధ‌న అవ‌స‌రాలు తీర్చుతూ లాభాల‌ను ఆర్జిస్తూ కార్మికుల‌కు లాభాల వాటా చెల్లించ‌డ‌మే కాకుండా ఏటా రాష్ట్ర ప్ర‌భుత్వానికి, కేంద్ర ప్ర‌భుత్వానికి డివిడెండ్‌లు చెల్లించ‌డంపై ముఖ్య‌మంత్రి , ఉప ముఖ్యమంత్రి హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

Also Read:యువకుల మృతి బాధాకరం: కేటీఆర్

- Advertisement -