- Advertisement -
నేను మారాను మీరు కూడా మారండని…తనను కలవడానికి వచ్చిన ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ మంత్రులందరికి నేనే ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేశా…మంత్రులు, ఎమ్మెల్యేల పని తీరుపై సర్వే రిపోర్టులు నా దగ్గర ఉన్నాయి అన్నారు.
నా ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా తెప్పించాను …అందరికీ ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తాను అన్నారు. ఏడాది పాలన అనుభవాలు, వచ్చే నాలుగేళ్లు ఉపయోగపడతాయి అన్నారు సీఎం రేవంత్. ఇకపై పార్టీ నాయకులకు ఎక్కువ సమయం కేటాయిస్తా అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పాత, కొత్త నాయకులు అందరూ కలిసి పనిచేయాలని…పార్టీలో చేరిన ఇతర పార్టీ ఎమ్మెల్యేలను కలుపుకొని పనిచేయాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండండి..మనకు తెలిసి ఏ తప్పు చేయలేదు, కానీ జరిగిన తప్పులను సరి చేసుకున్నాం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
Also Read:హిట్ 3…షూటింగ్‌లో విషాదం
- Advertisement -