స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థులపై దృష్టి సారించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈనెల 5లోగా జడ్పీటీసీ స్థానాల అభ్యర్థుల పేర్లను పీసీసీకి పంపాలని మంత్రులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకు సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. అన్ని జిల్లాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులతో సంప్రదించి ప్రతి జడ్పీటీసీ స్థానానికి ముగ్గురు బలమైన అర్హులైన అభ్యర్థులను గుర్తించాలని స్పష్టం చేశారు.
ఒక్కో స్థానానికి ముగ్గురు అభ్యర్థుల పేర్లను ఫైనల్ చేయాలని..ఆ తర్వాత పీసీసీ అన్ని రకాలుగా పరిశీలించి గెలిచే ఆవకాశం ఉన్న అభ్యర్థులను 6, 7 తేదీల్లో ఎంపిక చేస్తుందని వివరించారు.
ఎక్కడా చిన్నపొరపాటు చేయవద్దని గెలుపే లక్ష్యంగా పని చేయాలని మంత్రులకు ముఖ్యమంత్రి సూచించినట్లు సమాచారం. అభ్యర్థుల ఎంపిక మొదలు ప్రచారం, గెలుపు వరకి అంతా సమష్టిగా పనిచేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఎంపీటీసీ స్థానాలకు ఎక్కడికక్కడ జిల్లా నేతలే అభ్యర్థులు ఎంపిక చేయాలని, ఎక్కడైనా పోటీ అధికంగా ఉంటే పీసీసీ దృష్టికి తేవాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
Also Read:‘మహాకాళి’..అక్షయ్ రెస్పాన్స్ అదుర్స్

