- Advertisement -
రాష్ట్రంలో బీసీ కులగణన ప్రక్రియను వేగంగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి బీసీ కమిషన్‌ను కోరారు. బీసీ కులగణన ప్రక్రియ వీలైనంత తొందరగా పూర్తయ్యేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు.
పీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు, బీసీ కమిషన్ చైర్మన్ జి. నిరంజన్ గారు, సభ్యులు రాపోలు జయప్రకాశ్ , తిరుమలగిరి సురేందర్ , బాలలక్ష్మి సచివాలయంలో ముఖ్యమంత్రితో కలిసి బీసీ కులగణనకు అనుసరించాల్సిన విధివిధానాలపై చర్చించారు.
కుల గణన ప్రక్రియ విషయంలో సమగ్రంగా అధ్యయనం చేయాలని, అవసరమైతే ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను పరిశీలించాలని సీఎంగారు కమిషన్‌కు సూచించారు.
Also Read:KTR : దేవర ప్రీ రిలీజ్ రద్దుపై కేటీఆర్
- Advertisement -