అశ్విని కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు: సీఎం రేవంత్

6
- Advertisement -

భారీ వర్షాలతో ఆకేరు వాగు పొంగి ఇక్కడే యువ శాస్త్రవేత్త అశ్విని, ఆమె తండ్రి మోతీలాల్ మరణించారని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. సీతారాంపురం తండాలో అశ్విని మాతృమూర్తి, సోదరుడుని పరామర్శించానని..అశ్విని యువ శాస్త్రవేత్త ఆమె మరణం బాధాకరం అన్నారు.

ఆమె సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నాం అన్నారు. అశ్విని కుటుంబానికి ఇల్లు లేదు… ఆ కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నాం అని తెలిపారు. ఆకేరు వాగు పొంగిన ప్రతిసారి సీతారాం తండాతో పాటు పక్కన ఉన్న మరో రెండు తండాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అన్నారు సీఎం.

ఈ మూడు తండాలు కలిపి ఒకే పెద్ద గ్రామంగా మార్చేందుకు గాను అందరికీ ఒకే చోట ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని హౌసింగ్ డిపార్టుమెంట్ ను ఆదేశిస్తున్నా అన్నారు. ఆకేరు వాగు పొంగి ఇళ్లలోని పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులు, సర్టిఫికెట్స్ తడిచిపోయినందున ఒకే fir దాఖలు చేసి అందరికీ నూతన కార్డులు, సర్టిఫికెట్స్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి. ఆకేరు ప్రవాహం… నీటి నియంత్రణపై శాస్త్రీయంగా అంచనా వేసి నూతన వంతెన నిర్మించాలని ఆదేశాలు జారీ చేశారు.

Also Read:భారీ వర్షాలు..సచివాలయ ఉద్యోగుల విరాళం

- Advertisement -