WEF ఎండీ జెరెమీ జర్గెన్స్‌తో రేవంత్ భేటీ

10
- Advertisement -

దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF)–2026లో తెలంగాణ పెవిలియన్ వేదికగా కీలక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, WEF మేనేజింగ్ డైరెక్టర్ జెరెమీ జర్గెన్స్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తెలంగాణ భవిష్యత్ అభివృద్ధి దిశగా పలు వ్యూహాత్మక అంశాలపై ఇద్దరి మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది.

ఈ సమావేశంలో హైదరాబాద్‌లో WEF ఫాలో-అప్ సదస్సు నిర్వహించాలన్న ప్రతిపాదనను సీఎం రేవంత్ రెడ్డి ముందుంచారు. ప్రతి ఏడాది జూలై నెలలో ఫాలో-అప్ ఫోరం నిర్వహించే అంశంపై కూడా చర్చ జరిగింది. తెలంగాణను గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ఈ ఫోరం కీలక పాత్ర పోషిస్తుందని సీఎం వివరించారు.

అలాగే, సీఎం రేవంత్ రెడ్డి …“తెలంగాణ రైజింగ్ 2047 విజన్” ను WEF ప్రతినిధులకు వివరించారు. 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని సాధించేందుకు రూపొందించిన రోడ్ మ్యాప్‌ను వివరించగా, ఈ విజన్‌కు భాగస్వామిగా నిలుస్తామని WEF హామీ ఇచ్చింది.

హైదరాబాద్‌లో ఉన్న ప్రతిభావంతమైన మానవ వనరులు, స్టార్టప్ ఎకోసిస్టంపై WEF ప్రశంసలు కురిపించింది. అలాగే C4IR తెలంగాణ పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, భారత్‌లోనే తొలి థీమాటిక్ C4IRగా తెలంగాణకు లభించిన గుర్తింపును ప్రత్యేకంగా ప్రస్తావించింది.

Also Read:కరాటే కళ్యాణిపై దాడి..10 మందిపై కేసు

- Advertisement -