కేంద్ర బృందంతో సీఎం రేవంత్‌ రెడ్డి సమావేశం..

3
- Advertisement -

హైదరాబాద్ – రాష్ట్రంలో వరద నష్టం అంచనాపై కేంద్ర బృందంతో సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు.ఎలాంటి నిబంధనలు లేకుండా తక్షణ సాయంగా నిధులు విడుదల చేయాలని కోరారు సీఎం. ఈ సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎంపీ రఘురాం రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అంతకముందు మంత్రి పొంగులేటితో కేంద్ర బృందం భేటీ అయింది. సచివాలయంలో మంత్రి, అధికారులు బృందంతో వరద నష్టంపై చర్చలు జరిపారు. ఇటీవల కాలంలో సంభవించిన వరదలకు తెలంగాణ రాష్ట్రం తీవ్రస్థాయిలో నష్టపోయిందని పొంగులేటి తెలిపారు.

భారీ వర్షాలకు ప్రధాన రహదారులు, కాలనీలు జలమయమయ్యాయి. అనేక ఇళ్లు నీటిలో మునిగిపోయి ప్రజలు నిరాశ్రయులయ్యారని తెలిపారు. అన్నీ కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన బాధితులకు మానవీయ కోణంలో కేంద్రం పెద్ద మొత్తంలో సాయం చేసి ఆదుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

Also Read:ఫిట్‌గా ఉండాలంటే ఇలా చేయండి!

- Advertisement -