ఉపాసనకు కీలక బాధ్యతలు!

6
- Advertisement -

స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణ కో-చైర్‌మన్‌గా ఉపాసన కొణిదెలను నియమించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి సీఎం కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సంస్థకు చైర్మన్‌గా సంజీవ్ గోయెంకా ఉండగా తాజాగా ఉపాసన కామినేనిని కో చైర్మన్‌గా నియమించింది.

స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణకు తనను కో చైర్మన్‌గా నియమించటంపై ఉపాసన సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఈ నియామకం తనకు ఎంతో గౌరవాన్ని ఇచ్చిందని చెప్పుకొచ్చారు. తనకు సంజీవ్ గోయెంకాతో కలిసి పనిచేసే అవకాశం రావటం మరింత గౌరవంగా భావిస్తున్నట్లు ఉపాసన పేర్కొన్నారు.

బోర్డు సభ్యులుగా సన్ టివీ నెట్‌వర్క్, సన్ రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్, ప్రముఖ క్రికెటర్ కపిల్ దేవ్, పుల్లెల గోపిచంద్, భూటియా, అభినవ్ బింద్రా, రవికాంత్ రెడ్డి తదితరులను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Also Read:KTR:ఇది రాక్షస ప్రభుత్వం..

- Advertisement -