- Advertisement -
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో అత్యవసర సర్వీసుల ఉద్యోగుల సెలువులు రద్దు చేశారు. మంత్రులు, అధికారులు, ఉద్యోగులందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలని… బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలు సిద్ధం చేసుకోవాలి అన్నారు. అలాగే అత్యవసర ఔషధాలను సిద్ధం చేసుకోవాలి.. ప్రైవేటు ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న బెడ్స్ వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అన్నారు.
సైబర్ సెక్యూరిటీ మీద అప్రమత్తంగా ఉండాలి అని సూచించారు. ఫేక్ న్యూస్ ప్రచారం చేసే వారిపైన ఉక్కు పాదం మోపాలి… ఉగ్రవాదంపై పోరాటంలో భారత సైన్యానికి మనం ఉన్నామనే సందేశం ఇవ్వాలి అన్నారు.
Also Read:భారత సైన్యానికి సెల్యూట్ :కేటీఆర్
- Advertisement -

