మెట్రో విస్తరణ పై సిఎం రేవంత్ రెడ్డి నిర్ణయం

2
- Advertisement -

నూతన సంవత్సర కానుకగా శామీర్ పెట్, మేడ్చల్ వరకు మెట్రో మార్గాలను విస్తరించాలని నిర్ణయం తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. జేబిఎస్ నుండి శామీర్ పెట్ (22 కిలోమీటర్లు) , ప్యారడైజ్ నుండి మేడ్చల్ (23 కిలోమీటర్లు) వరకు మెట్రో మార్గానికి మెట్రో రైల్ ఫేజ్ -2 ‘బి’ భాగంగా డీపీఆర్ తయారు చేయాలని మెట్రో అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

DPRలను త్వరగా పూర్తి చేసి మెట్రో రైలు ప్రాజెక్ట్ ఫేజ్-2Bలో చేర్చాలన్నారు సీఎం. అనంతరం ఈ నివేదికలను ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు.

ప్యారడైజ్ నుండి మేడ్చల్ వరకు ,జూబ్లీ బస్ స్టేషన్ (JBS) నుండి శీమిర్‌పేట వరకు మెట్రో లైన్‌ను విస్తరించాలని నిర్ణయం తీసుకన్నారు సీఎం. ప్రజా రవాణాను మెరుగుపరచడానికి మరియు నగరం యొక్క పెరుగుతున్న పట్టణ అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ఈ ప్రాజెక్టు విస్తరణ పూర్తయితే ప్రజా కనెక్టెవిటీ మెరుగవడంతో పాటు ట్రాఫిక్ రద్దీ తగ్గనుంది.

Also Read:హిట్‌ 3…షూటింగ్‌లో విషాదం

- Advertisement -