తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన సాగనుంది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఇవాళ జపాన్ వెళ్లనుంది. ఈ నెల 22వ తేదీ వరకు టోక్యో, మౌంట్ ఫుజీ, ఒసాకా, హిరోషిమా నగరాల్లో పర్యటించనున్నారు. సీఎం వెంట మంత్రి శ్రీధర్ బాబుతో పాటు జయేశ్ రంజన్ తదితరులు ఉన్నారు.
ఏప్రిల్ 17న టోక్యోలోని ప్రముఖ సంస్థల ప్రతినిధులతో సీఎం సమావేశమవుతారు. అదే రోజు తోషిబా ఫ్యాక్టరీని సందర్శించి కంపెనీ కార్యకలాపాలను సమీక్షించనున్నారు. ఏప్రిల్ 18న గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించిన అనంతరం, టోక్యో గవర్నర్‌తో సమావేశం, పారిశ్రామికవేత్తలతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు.
Also Read:కొండారెడ్డిపల్లికి రైతు కమిషన్
టొయోటా, తోషిబా, ఐసిన్, ఎన్టీటీ వంటి దిగ్గజ సంస్థల సీఈఓలతో వరుస భేటీలు జరపనున్నారు. సుమిదా రివర్ ఫ్రంట్, మౌంట్ ఫుజీ, అరకురయామా పార్క్, కిటాక్యూషు సిటీ ఎకో టౌన్ ప్రాజెక్టులు, ఎన్విరాన్‌మెంట్ మ్యూజియం, మురసాకి రివర్ మ్యూజియం లాంటి ప్రాజెక్టులను సందర్శించి సుస్థిర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణలో వాటి పాత్రను అధ్యయనం చేయనున్నారు. ఏప్రిల్ 21న వరల్డ్ ఎక్స్‌పో – 2025లో తెలంగాణకు కేటాయించిన పవిలియన్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.

