చంద్రబాబుకు కంప్యూటర్‌ గురించి తెలియదు: రేవంత్

17
- Advertisement -

ఏపీ సీఎం చంద్రబాబుపై షాకింగ్ కామెంట్స్ చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. దావోస్ పర్యటనలో భాగంగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన సీఎం..పీవీ నర్సింహ రావు , చంద్రబాబు నాయుడుకి కంప్యూటర్ గురించి ఏమీ తెలియదు కనీసం కంప్యూటర్ ఆన్, ఆఫ్ చేయడం కూడా తెలియదు అని వ్యాఖ్యానించారు.

అల్లు అర్జున్ ఎపిసోడ్ గురించి సైతం స్పందించారు. అల్లు అర్జున్‌ని అరెస్ట్ చెయ్యడం మంచిది కాదని చంద్రబాబు నాయిడు అన్నారు అని ప్రశ్నించగా అల్లు అర్జున్‌ని ఎందుకు అరెస్ట్ చేసామో చంద్రబాబు నాయుడుకు తెలియదు.. మొత్తం తెలుసుకొని మాట్లాడాలి అని రేవంత్ హితవు పలికారు.

తొక్కిసలాటలో మహిళ చనిపోతే, అల్లు అర్జున్ 10-12 రోజులు వాళ్ళ ఫ్యామిలీని పట్టించుకోలేదు అన్నారు రేవంత్. నేను పొలిటీషియన్‌ని, పాలసీ మేకర్‌ని.. నాకు అన్ని తెలవాల్సిన అవసరం లేదు అన్నారు.

Also Read:డిప్యూటీ సీఎం ప్రచారంపై నారా లోకేశ్

- Advertisement -