పద్మ అవార్డు గ్రహీతలను సన్మానించడం ఒక బాధ్యతగా భావించాం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ శిల్పకళా వేదికలో పద్మ అవార్డు గ్రహీతలకు ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం రేవంత్. ఇది రాజకీయాలకు అతీతమైన కార్యక్రమం అన్నారు.
తెలుగువాళ్లు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా మనవారే అన్నారు. ఒక మంచి సంప్రదాయానికి పునాది వేసేందుకే ఈ కార్యక్రమం అన్నారు. ఈ సంప్రదాయాన్ని ఇలాగే కొనసాగించాలి..అవార్డు గ్రహీతలు ప్రభుత్వాన్ని అభినందించడమంటే.. మన ప్రజా పాలనను అభినందించినట్లేనన్నారు.
పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు రూ.25 లక్షల నగదు బహుమతి ప్రభుత్వం తరపున అందిస్తాం అన్నారు. దీంతో పాటు ప్రతీ నెల పద్మశ్రీ అవార్డు పొందిన కవులు, కళాకారులకు రూ.25వేల పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించాం అన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు మనమంతా ఏకమై ముందుకు సాగాలి…ఒక తెలుగువాడిగా వెంకయ్య నాయుడు రాష్ట్రపతి స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నా అన్నారు.
Also Read:ఆకట్టుకుంటున్న ‘లక్కీ భాస్కర్’ ఫస్ట్ లుక్