పాతబస్తీ ప్రజల చిరకాల వాంచ నెరవేరబోతోంది. పాతబస్తీ మెట్రో రైలు నిర్మాణ పనుల ప్రారంభానికి ముహుర్తం ఖరారైంది. ఈనెల 8న మెట్రో రైలు పనులకు శంకుస్థాపన చేయనున్నారు సీఎం రేవంత్. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5.కిలోమీటర్ల మెట్రో మార్గానికి పనులు మొదలుపెట్టనున్నారు. సాలార్‌జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, ఫలక్‌నుమా మధ్య నాలుగు స్టేషన్లతో ఈ కారిడార్ అందుబాటులోకి రాబోతోంది.
రెండో దశలో మొత్తం 70 కి.మీ. కొత్త రైలు మార్గాన్ని నిర్మించాలని నిర్ణయించగా ఇందుకు సంబంధించి రూట్ మ్యాప్‌లను ఖరారు చేశారు. ఇందులో భాగంగా పాతబస్తీలో నిర్మించే 5.5 కి.మీ మార్గానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు నిర్మించనున్న ఈ మెట్రో మార్గం నిర్మాణానికి సుమారు రూ. 2000 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు.
Also Read:అల్లం పాలు..ఎన్ని ఉపయోగాలో!