ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..

15
- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు రేవంత్. సీఎంతో పాటు మరికొంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీకి పయనం కానున్నారు.

బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై అసెంబ్లీలో చేసిన తీర్మానాలపై అధిష్టానం పెద్దలతో కలిసి చర్చించే అవకాశం ఉంది. అలాగే మంత్రివర్గ విస్తరణపై కూడా చర్చ జరగనున్నట్టు సమాచారం.

ఎమ్మెల్యేల తిరుగుబాటు నేపథ్యంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరుగుతున్న ఈ సమావేశంలో టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌, మంత్రులు కూడా పాల్గొనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పలు అంశాలపై సీఏం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలు, ఎస్సీ వర్గీకరణ, కులగణన సర్వే,స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కాంగ్రెస్ పార్టీ 42 శాతం సీట్లు ఇవ్వనుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

Also Read:తెలంగాణకు 4 టీఎంసీల నీటి విడుదల

- Advertisement -