తెరపైకి మళ్లీ కేబినెట్ విస్తరణ..16న ఢిల్లీకి సీఎం!

13
- Advertisement -

తెలంగాణ కేబినెట్ విస్తరణ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ అంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ నెల 16న సీఎం రేవంత్ హస్తినకు వెళ్లనున్నట్లు తెలుస్తోండగా మళ్లీ కేబినెట్ విస్తరణ అంశం తెరపైకి వచ్చింది.

రేవంత్‌తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబులు కూడా ఢిల్లీకి వెళ్లనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. రేవంత్ రెడ్డి పర్యటనలో ప్రధానంగా మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల నియామకం, పీసీసీ కమిటీ కూర్పుపై పార్టీ హైకమాండ్‌తో చర్చించనున్నారు.

మంత్రివర్గ విస్తరణపై అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) కొంతకాలంగా కసరత్తు చేస్తుండగా, సామాజిక సమతూకంపై భిన్నాభిప్రాయాల కారణంగా మంత్రివర్గ విస్తరణ ఆలస్యమైనట్లు సమాచారం. దీన్ని దృష్టిలో ఉంచుకుని సెప్టెంబర్ 16న మరోసారి పార్టీ అధిష్టానంతో రేవంత్ భేటీ కానున్నారు. నామినేటెడ్ పదవుల కోసం ఇప్పటికే 27 మంది పేర్లతో కూడిన జాబితాను సిద్ధం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మొత్తంగా తెలంగాణ రాజకీయాల్లో కేబినెట్ విస్తరణ అంశం చర్చనీయాంశంగా మారింది.

Also Read:సత్ఫలితాన్నిస్తున్న గ్రీన్ ఛాలెంజ్..

- Advertisement -