Revanth:ఢిల్లీకి సీఎం రేవంత్!

13
- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. కేబినెట్ విస్తరణ అంశం తుదిదశకు చేరుకోవడంతో ఈ లిస్ట్‌ను అధిష్టానానికి అందించి అమోదం లభించిన వెంటనే మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారు. ఇప్పటికే పలుమార్లు ఢిల్లీకి వెళ్లిన రేవంత్…పీసీసీ చీఫ్‌ నియామకంతో పాటు మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టులపై చర్చించారు.

అయితే ఎవరెవరికి పదవులు ఇవ్వాలన్న దానిపై అందరూ ఒకేతాటి మీదకు రావాలని హైకమాండ్ సూచించింది. ఇక రాష్ట్రంలో కీలకనేతలు సమావేశం కాగా దీనిపై ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోండగా ఈసారి రేవంత్ ఒక్కరే ఢిల్లీకి వెళ్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఢిల్లీ పర్యటనలో భాగంగా పార్టీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, అగ్రనేత రాహుల్‌తో చర్చించిన తర్వాత ప్రకటన వెలువడనుంది. మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే పీసీసీ చీఫ్‌ నియామకం, మంత్రివర్గ విస్తరణ ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read:Trump:ట్రంప్‌కు రిలీఫ్

- Advertisement -