దావోస్‌కు రేవంత్..కోర్టు పర్మిషన్

4
- Advertisement -

ప్రపంచ ఆర్థిక సదస్సు (వరల్డ్ ఎకనామిక్ ఫోరం)లో పాల్గొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కోర్టు అనుమతి లభించింది. దావోస్‌కు వెళ్లేందుకు అనుమతివ్వాలంటూ సీఎం దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ఏసీబీ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జనవరి 19 నుంచి 23 వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరయ్యేందుకు కోర్టు రూ.10 వేల పూచీకత్తుపై అనుమతి మంజూరు చేసింది.

ఓటుకు నోటు కేసులో బెయిల్‌పై ఉన్న రేవంత్ రెడ్డి పాస్‌పోర్టు ప్రస్తుతం కోర్టు అధీనంలో ఉంది. ఈ నేపథ్యంలో విదేశీ పర్యటనకు వెళ్లాలంటే ముందస్తు అనుమతి అవసరం కావడంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సదస్సులో పాల్గొననున్నట్టు పిటిషన్‌లో పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి దృష్ట్యా ఈ పర్యటన అవసరమని న్యాయస్థానం అభిప్రాయపడింది.

అయితే కొన్ని షరతులు కూడా విధించింది. విదేశీ పర్యటన ముగిసిన వెంటనే, మార్చి 3లోపు తన పాస్‌పోర్టును తిరిగి కోర్టుకు అప్పగించాలని స్పష్టం చేసింది. అలాగే పర్యటన వివరాలను కోర్టుకు తెలియజేయాలని సూచించింది. కోర్టు అనుమతితో సీఎం రేవంత్ రెడ్డి దావోస్‌లో అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో సమావేశాలు నిర్వహించి తెలంగాణకు పెట్టుబడులు రప్పించేందుకు ప్రయత్నించనున్నారు. ఈ పర్యటన రాష్ట్రానికి కీలకంగా మారనుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

Also Read:ఏపీలో ‘స్క్రబ్ టైఫస్’ టెన్షన్

- Advertisement -