Revanth:చంద్రబాబు బాటలో తెలంగాణ సి‌ఎం ?

32
- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చంద్రబాబును ఫాలో అవుతున్నారా ? అంటే అవునేమో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ చంద్రబాబు హయంలో జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వీటి ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అదే విధంగా తెలంగాణలో ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుకు సి‌ఎం రేవంత్ రెడ్డి సిద్దమౌతున్నట్లు టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ ప్రకటించిన హామీలను ఇందిరమ్మ కమిటీల ద్వారా పూర్తి స్థాయిలో ప్రజలకు చేరవేసే ప్లాన్ లో రేవంత్ రెడ్డి సర్కార్ ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ ఎన్నికల ముందు చాలానే హామీలు ప్రకటించినప్పటికి ప్రధానంగా ఆరు గ్యారెంటీలను హైలెట్ చేస్తూ వచ్చింది. ఇప్పటికే ఆరు గ్యారెంటీలలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ పెంపు, రూ.500 వంటగ్యాస్, 200 యూనిట్ల ఉచిత కరెంటు పథకాలను అమల్లోకి తీసుకొచ్చింది. .

ఇంకా అమలు చేయాల్సిన పథకాలు చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేసి లబ్ది దారులను గుర్తించి పథకాలు అమలు చేసేలా కాంగ్రెస్ ప్లాన్ చేస్తోందట. అయితే ఏపీలో జన్మభూమి కమిటీలపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమౌతు వచ్చింది. ఆ కమిటీల ద్వారా పెద్ద మొత్తంలో అవినీతి జరిగిందని, పథకాలు ప్రజలకు చేరకుండా అధికారులు కుంభకోణాలకు పాల్పడ్డారని గట్టిగానే విమర్శలు వ్యక్తమౌతు వచ్చాయి. ఇప్పుడు అదే తరహాలో రేవంత్ రెడ్డి ఇదిరమ్మ కమిటీల దిశగా అడుగులు వేస్తుదండడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఏపీలో జన్మభూమి కమిటీలు వ్యహరించిన తీరులో ఇక్కడ ఇందిరమ్మ కమిటీలు వ్యవహరిస్తే ప్రజల పరిస్థితి ఎంటనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి చంద్రబాబు శిష్యుడిగా రేవంత్ రెడ్డి కూడా ఆయన దారిలోనే వెళుతుండడం తెలంగాణ ప్రజలను కొంత కలవర పెట్టె అంశం.

Also Read:మెగ్నీషియం లోపిస్తే.. ఇన్ని సమస్యలా?

- Advertisement -