నామినేటెడ్ పోస్టుల పై ఫోకస్ ?

95
- Advertisement -

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీ నేతలు కొత్త ఉత్సాహంతో కనిపిస్తున్నారు. ఒకవైపు ఇచ్చిన హామీల అమలు దిశగా అడుగులు వేస్తూనే.. మరోవైపు ఇతరత్రా పోస్టుల భర్తీపై దృష్టి సారిస్తోంది రేవంత్ రెడ్డి సర్కార్. ఈ నేపథ్యంలో నామినేటెడ్ పోస్టుల భర్తీపై గత కొన్నాళ్లుగా తరచూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. పోస్ట్ ల భర్తీపై సి‌ఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే డిల్లీ పెద్దలతో కూడా పలుమార్లు సమావేశం అయ్యారు. ఇక త్వరలోనే పోస్టుల భర్తీ జరగనుందని ఇటీవల స్పష్టం చేయడంతో ఆశావాహుల్లో ఆశలు చిగిరిస్తున్నాయి. ఎవరెవరికి పోస్టులు దక్కనున్నాయనే దానిపై కూడా ఇటీవల రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. మొదటి నుంచి పార్టీ కోసం పని చేసిన వారికె పోస్టుల కేటాయింపు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

ఈ నెల 3వ తేదీన తొలి విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పోస్టుల భర్తీపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అలాగే మంత్రివర్గ విస్తరణలో కూడా ఇంకా ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉండడంతో వాటిపై కూడా ఈ విస్తృత స్థాయి సమావేశంలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మంత్రి పదవుల రేస్ లోనూ, నామినేటెడ్ పోస్టుల విషయంలోనూ చాలా మందే రేస్ లో ఉన్నారు. లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం 20 నుంచి 30 నామినేటెడ్ పోస్టులను మాత్రమే భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు టాక్. సంక్రాంతి లోపు వీటిని భర్తీ చేసి మంత్రివర్గ విస్తరణపై నెలకొన్న కన్ఫ్యూజన్ కు కూడా తెర దించాలనేది కాంగ్రెస్ సర్కార్ ప్లాన్ గా తెలుస్తోంది. మరి హస్తం సర్కార్ ప్రణాళికలు ఎంతవరకు సాఫీగా జరుగుతాయో చూడాలి.

Also Read:రణధీర్..ముద్ర

- Advertisement -