రేవంత్ ఢిల్లీ టూర్..గుండు సున్నా!

16
- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డిపై తనదైన శైలీలో మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. ఢిల్లీకి 42 సార్లు వెళ్లినా సీఎం రేవంత్ రెడ్డి సాధించింది గుండు సున్నా అని ఎద్దేవా చేశారు.ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం, మరోవైపు కేంద్ర ప్రభుత్వం రెండు కలిసి ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని హరీశ్ రావు ఆరోపించారు.

తెలంగాణకు జరిగే నష్టంపై నోరు మెదపకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. మరోవైపు ఉపాధి హామీ కూలీలకు నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందని.. వారి జీవితాలతో ఆడుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రానికి మంజూరైనా నరేగా పనిదినాలను కేంద్ర ప్రభుత్వం సగానికి తగ్గించడం శోచనీయమని అన్నారు. 2024-25లో రూ.12.22 కోట్ల పనిదినాలు మంజూరు చేయగా, ఈ సంవత్సరం కేవలం రూ. 6.5 కోట్ల పనిదినాలకే పరిమితం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీకి చెరో 8 మంది ఎంపీలు ఉన్నా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుందని అన్నారు.

Also Read:HIT 3: రెండో రోజు వసూళ్ల జోరు

- Advertisement -