మెట్రో,ఫార్మా సిటీ రద్దు చేయలేదు:సీఎం రేవంత్

26
- Advertisement -

 మెట్రో కానీ , ఫార్మాసిటీ కానీ రద్దు చెయ్యడం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడిన రేవంత్..ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని స్ట్రీమ్ లైన్ చేస్తున్నా అన్నారు. ఎయిర్పోర్టు కి ముందు ప్రభుత్వం ప్రతిపాదించిన రూట్లతో పోలిస్తే దూరం తగ్గిస్తాం ..BHEL నుంచి ఎయిర్పోర్ట్ వరకు 32 కిలోమీటర్లు వస్తుందన్నారు.

ఎం జి బి ఎస్ నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు మెట్రో ఉంటుందని.. నాగోల్ నుంచి ఎల్బీ నగర్, ఓ ఎస్ హాస్పిటల్ మీదుగా చాంద్రాయణ గుట్ట వద్ద ఎయిర్పోర్టు కి వెళ్లే మెట్రో లైన్ కి లింక్ చేస్తాం అన్నారు. మియాపూర్ నుంచి అవసరమైతే రామచంద్ర పురం వరకు మెట్రో పొడిగిస్తాం అని..అవసరమైతే మైండ్ స్పేస్ వరకు ఉన్న మెట్రో ని ఫైనాన్సిల్ డిస్ట్రిక్ట్ వరకు పొడిగిస్తాం అని తెలిపారు. గచ్చిబౌలి ఏరియా నుంచి ఎయిర్పోర్టు కి మెట్రో వెళ్లేవారు దాదాపు ఉండరు..
మేము కొత్తగా ప్రతిపాదిస్తున్న మెట్రో లైన్స్ ముందు ప్రభుత్వం ప్రతిపాదించిన మొత్తం కంటే తక్కువ అవుతుందన్నారు.

ఫార్మాసిటీ ని అంచలంచలుగా రింగ్ రోడ్ రీజినల్ రింగ్ రోడ్ మధ్య ప్రత్యేకంగా క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని..జీరో కాలుష్యం తో ఈ క్లస్టర్లు ఏర్పాటు చేస్తాం అన్నారు.అక్కడనే అక్కడి పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళకి గృహనిర్మాణం కూడా ఉంటుందని..అక్కడి వాళ్ళు ఎవ్వరు కూడా హైదరాబాద్ వరకు రాకుండా అన్ని ఏర్పాట్లు ఉండేట్లు క్లస్టర్లు ఉంటాయన్నారు.

గతంలోని సీఎం క్యాంపు కార్యాలయాన్ని స్టేట్ గెస్ట్ హౌస్ గా మారుస్తాం అని..యువతకు అవసరమైన స్కిల్స్ పెంచేందుకు ప్రత్యేక విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తామన్నారు.అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు కలిగిన ….ప్రముఖ పేరున్న పారిశ్రామిక వేత్తల ద్వారా ఈ స్కిల్స్ పై శిక్షణ ఉంటుందని..సాధారణ డిగ్రీలకు ఉండే అర్హతలన్నీ ఉంటాయి ….స్కిల్స్ అదనంగా ఉంటాయన్నారు.అక్కడ నుంచి బైటకి వెళ్ళేవాళ్ళకి క్యాంపస్ లోనే ఎంపిక ఉంటుందని..ఇప్పటికే అధికారాన్ని వికేంద్రీకరించాం అన్నారు.

మంత్రులను ఉమ్మడి జిల్లాలకు ఇంచార్జి లుగా బాధ్యతలు అప్పగించాం అని..100 బెడ్స్ ఆస్పత్రి ఉన్న చోట నర్సింగ్ కళాశాల ఉంటుందన్నారు.విదేశాలకు వెళ్లే యువతకు ఓరియంటేషన్ ఇప్పిస్తాం అని…ఆయాదేశాలకు అవసరమైన మాన్ పవర్ ను ప్రభుత్వం ద్వారా అందిస్తాం అని తెలిపారు. ఇందువల్ల యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పరుస్తాం అని…మన వద్ద పెద్ద సంఖ్యలో యువత ఉంది…వారికీ ఆసక్తి కలిగిన విభాగాల్లో శిక్షణ ఇప్పిస్తాం అన్నారు.

చాలా మంది సీనియర్ అధికారులు ప్రావిణ్యం కలిగిన వారికి శిక్షణ ఇప్పించే అవకాశం ఉందని..3వ తేదీన పీసీసీ విస్తృతస్థాయి సమావేశం ఉందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పదవులు ఇస్తాం అని..పార్టీ కోసం పనిచేసిన వారితో నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తాం అన్నారు.నాకు దగ్గరనో భందువులనో పదవులు ఇచ్చేది ఉండదన్నారు.నేను ఏది చేసినా విస్తృతస్థాయి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పదవులు భర్తీ చేస్తాం …పార్టీ కోసం పని చేసిన వారికీ పదవులు ఇస్తాం అన్నారు.

ప్రెస్ అకాడమీ చైర్మన్ భర్తీ చేసిన తర్వాత జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని…హైదరాబాద్ కమిషనరేట్ల కమిషనర్లను నియమించా ….వారికీ అవసరమైన
మాన్ పవర్ ను వాళ్ళే పిక్ చేసుకుంటారన్నారు. శాఖలకు ప్రతిభ కలిగిన అధిపతులను నియమించడం వరకు నేను చూస్తా …వాళ్ళ పరిధిలో అవసరమైన అధికార్లను నియమించుకుని యంత్రాంగం సక్రమంగా పనిచేసేట్లు చూసుకోవాలన్నారు.అధికార్ల నియామకాల్లో సామాజిక న్యాయం కూడా జరిగేట్లు చూస్తాం …సంస్కరణలు తీసుకొచ్చి స్ట్రీమ్ లైన్ చేసే పనిలో ఉన్నా అన్నారు. జర్నలిస్టులకు సంభందించి సమస్యను పూర్తి స్థాయి లో పరిష్కరిస్తాం …ఇప్పటి నుంచి వంద రోజుల్లో పరిష్కరిస్తాం అని తెలిపారు.

- Advertisement -