సింగపూర్ విదేశాంగ మంత్రితో సీఎం రేవంత్

2
- Advertisement -

సింగపూర్ విదేశాంగ మంత్రి వివాన్ బాలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. తెలంగాణలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, విద్యుత్, స్థిరమైన గ్రీన్ ఎనర్జీ, వాటర్ మేనేజ్మెంట్, నదుల పునరుద్ధరణ, టూరిజం, విద్య, నైపుణ్యాభివృద్ధి, ఐటీ వంటి పలు అంశాలపై చర్చలు జరిపారు సీఎం రేవంత్.

గ్రీన్ ఎనర్జీ, టూరిజం, నదుల పునరుజ్జీవనంపై సింగపూర్ విదేశాంగ మంత్రితో చర్చలు జరిపారు. తెలంగాణలో పెట్టుబడులకు సంబంధించి వివిధ కంపెనీల ప్రతినిధులతో సంప్రదింపులు జరపనున్నారు సీఎం రేవంత్. సింగపూర్ పర్యటన అనంతరం ఈ నెల 20న దావోస్ కు పయనం అవుతారు రేవంత్. 20 నుంచి 22 వరకు దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో పాల్గొంటారు.

Also Read:రేవంత్ రెడ్డి..లై డిటెక్టర్‌ పరీక్షకు సిద్ధమా?:కేటీఆర్

- Advertisement -