వసతి గృహాల ఘటనలపై సీఎం రేవంత్ ఫైర్

8
- Advertisement -

వ‌స‌తిగృహాల్లో త‌ర‌చూ ఘ‌ట‌న‌లు చోటుచేసుకోవ‌డంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. బాధ్యులైన వారిపై వేటు వేయాల‌ని…నివేదిక‌ల‌ను సమ‌ర్పించాలన్నారు. ప‌లుమార్లు ఆదేశాలు ఇచ్చినా పొర‌పాట్లు చోటుచేసుకుంటుండంపై సీఎం ఆవేద‌న వ్యక్తం చేశారు.ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు యత్నిస్తే మాత్రం చర్యలు కఠినంగా ఉంటాయని …బాధ్యులైన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తామని సీఎం తెలిపారు.

విద్యార్థుల‌కు ఆహారం అందించే విష‌యంలో ఉదాశీనంగా వ్య‌వ‌హ‌రించే అధికారులు, సిబ్బందిపై చ‌ర్య‌లు త‌ప్ప‌వు అన్నారు రేవంత్ రెడ్డి. లేని వార్త‌లను ప్ర‌చారం చేస్తూ విద్యార్థుల త‌ల్లిదండ్రుల్లో భ‌యాందోళ‌న‌లు సృష్టిస్తున్నార‌ని…. వారిపైనా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌కు ముఖ్య‌మంత్రి ఆదేశించారు.

Also Read:TTD: అమ్మవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

- Advertisement -