- Advertisement -
కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే TSPSC పై దృష్టిసారించారు సీఎం రేవంత్ రెడ్డి. TSPSC ప్రక్షాళన చేయాలని సూచించిన రేవంత్..ఇందుకు సంబంధించి రివ్యూ నిర్వహించారు. ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ చైర్మన్ తో సహా సభ్యులను రాజీనామా చేయించారు. అయితే రాజీనామాలపై గవర్నర్ తమిళి సై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. రాజీనామాల ఆమోదంలో న్యాయనిపుణుల సలహా కోరారు గవర్నర్.
రాజీనామాల అంశాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు గవర్నర్. రాజీనామాల విషయం కొలిక్కి రాకపోవడంతో నోటిఫికేషన్ల విషయంలో అడుగు ముందుకు వేయలేకపోతోంది ప్రభుత్వం. రాజీనామాల ఆమోదం కోసం ఇప్పటికే మూడు నాలుగు సార్లు గవర్నర్ ని సంప్రదించింది ప్రభుత్వం. గవర్నర్ నిర్ణయం తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్ చేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
Also Read:పది రోజుల తర్వాతే దేవర మొదలు
- Advertisement -