CM Revanth:నిరుద్యోగుల కోసమే గ్రూప్ 2 వాయిదా

14
- Advertisement -

హైదరాబాద్‌ ప్రజా భవన్ లో “రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం” ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. నియామకాల కోసమే తెలంగాణ పోరాటం జరిగిందని…త్యాగాల పునాదులపై తెలంగాణ ఏర్పడిందన్నారు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని, అందుకే అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో 30వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించాం అన్నారు.

గత పదేళ్లలో నిరుద్యోగులకు తీరని నష్టం జరిగిందని, యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీని మార్పులు చేశాం అన్నారు. గ్రూప్స్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వాహించాం… డీఎస్సీ పరీక్షలు కొనసాగుతున్నాయన్నారు. నిరుద్యోగుల ఇబ్బందులను గుర్తించి గ్రూప్2 పరీక్ష వాయిదా వేశాం అని,ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడమేనన్నారు.

పకడ్బందీ ప్రణాళికతో పరీక్షలు సమర్ధవంతంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ ప్రవేశపెట్టనున్నాం అన్నారు. ఇక నుంచి ప్రతీ ఏటా మార్చ్ లోగా అన్ని శాఖలలో ఖాళీల వివరాలు తెప్పించుకుంటాం…జూన్ 2లోగా నోటిఫికేషన్ వేసి డిసెంబర్ 9లోగా నియామక ప్రక్రియ పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటాం అన్నారు. మంచి కార్యక్రమాన్ని చేపట్టిన సింగరేణి సంస్థకు అభినందనలు చెప్పారు.

Also Read:స్కిన్ అలర్జీ..అయితే జాగ్రత్త!

- Advertisement -