ఫాక్స్‌కాన్‌కు సంపూర్ణ సహకారం అందిస్తాం:సీఎం రేవంత్

30
- Advertisement -

ఫాక్స్‌కాన్ సంస్థ చేపట్టబోయే భవిష్యత్ ప్రాజెక్టులకు కూడా అవసరమైన అన్ని సహాయ సహకారాలను అందిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.తెలంగాణలో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ అభివృద్దిని మరింత వేగవంతం చేస్తామన్నారు. కొంగర కలాన్ ఉత్పాదక కేంద్రం నిర్వహణకు అవసరమైన సహాయ సహకారాలను అందిస్తామన్నారు.

డిసెంబరు 2023 లో తెలంగాణ ప్రభుత్వంతో ఫాక్సాకాన్ గ్రూప్ ఒప్పందం కుదిరింది. ఫాక్సాకాన్ సంస్థ ఆపిల్ ఐఫోన్లను ప్రధానంగా తయారుచేస్తుంది. ఫాక్సాకాన్ సంస్థ ప్రధాన కస్టమర్లలో Google, Xiaomi, Amazon, Hewlett Packard, HUAWEI, Alibaba Group, CISCO, Dell, Facebook, Nentendo, Sony, Microsoft, SEGA, Nokia వంటివి ఉన్నాయి.

చైనా, వియత్నాం, థాయ్లాండ్, మలేషియా, అమెరికా, యూరప్, భారత్ సహా 24 దేశాలలో ఫాక్సాకాన్ సంస్థ కార్యకలాపాలు సాగిస్తున్నది. మన దేశంలో శ్రీసిటి (ఎపి), శ్రీపెరంబుదూర్ (తమిళనాడు), తెలంగాణ (కొంగరకలాన్) మరియు కర్ణాటక (బెంగళూరు సమీపంలో) సంస్థ పనిచేస్తున్నది. ఫాక్సాకాన్ సంస్థ ఎలక్ట్రానిక్స్ తయారుచేసే వ్యవస్థలను ఏర్పాటు చేయడం ద్వారా 1,00,000 ఉద్యోగాలను కల్పిస్తామనే హామితో తెలంగాణ ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందం (MoU)పై సంతకం చేసింది. మొదటి దశలో, వచ్చే రెండేళ్లలో 25000 ఉద్యోగాలు కల్పించనున్నారు.

Also Read:ముఖ్య గ‌మ‌నిక..ఫ‌స్ట్ సింగిల్

- Advertisement -