Revanth:ఆరోగ్య శ్రీ బిల్లులను రిలీజ్ చేయండి

25
- Advertisement -

ఎయిమ్స్‌ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పెండింగ్‌లో ఉన్న ఆరోగ్య శ్రీ బిల్లులను రిలీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. సచివాలయంలో వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష జరిపారు.తద్వారా ఉస్మానియా, నిమ్స్ దవాఖానలపై భారం తగ్గుతుందని చెప్పారు.

ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో అనుసంధానంగా ఉన్న టీచింగ్ హాస్పిటల్స్, ప్రభుత్వ హాస్పిటల్స్‌కు పెండింగ్‌లో ఉన్న ఆరోగ్యశ్రీ బిల్లులు వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. ప్రతీ నెల 15వ తేదీలోగా ప్రభుత్వ దవాఖానలకు ఆరోగ్యశ్రీ బిల్లులు విధిగా విడుదల చేయాలన్నారు.

ప్రాంతాల వారీగా ఉన్న ప్రభుత్వ దవాఖానల్లో కొన్నింటిని గుర్తించి వాటికి సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మెడికల్ కాలేజీలతో అనుసంధానంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో హౌస్‌ కీపింగ్‌ నిర్వహణ బాధ్యత పెద్ద ఫార్మా కంపెనీలకు అప్పగించాలన్నారు.

Also Read:ఎట్టకేలకు.. ఫామ్ లోకి ప్లాప్ హీరో

- Advertisement -