Revanth Reddy:అక్రమ నిర్మాణాల కూల్చివేత ఆగదు

3
- Advertisement -

అక్రమ నిర్మాణాల కూల్చివేత ఆగదని తేల్చిచెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ పోలీస్ అకాడమీలో సబ్ ఇన్ స్పెక్టర్లుగా ట్రైనింగ్ పూర్తిచేసుకున్న 547 మంది పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు రేవంత్. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం..హైడ్రా అక్రమ నిర్మాణాల కూల్చివేతపై మరోసారి స్పందించారు. .

అక్రమార్కులు ఎంత పెద్ద వారైన వదలిపెట్టబోమన్నారు. కూల్చివేతలపై కోర్టులకు వెళ్లి తాత్కాలికంగా స్టే తెచ్చుకున్నా, న్యాయస్థానాల్లో పోరాటం చేసి గెలుస్తామన్నారు. కబ్జాదారులు ఇకనైనా ఆక్రమణలను విడిచిపెట్టాలన్నారు. ఎఫ్ టీఎల్, బఫర్ జోన్లలో ఇళ్లు కట్టుకున్నవారు వెంటనే వాటిని విడిచిపెట్టాలని సీఎం రేవంత్ సూచించారు. అక్రమ నిర్మాణాలు ఎప్పటికైనా నేలమట్టం కాకతప్పదని హెచ్చరించారు.

ట్రైనింగ్ పూర్తి చేసుకున్న సబ్ ఇన్ స్పెక్టర్లు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. బాధితులతో ఫ్రెండ్లీ పోలీస్ గా మెలుగుతూ.. క్రిమినల్స్ పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు. డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. అలాగే సైబర్ క్రైమ్ రేటు కూడా తగ్గించేందుకు కృషి చేస్తున్నామన్నారు.

Also Read:తెరపైకి మళ్లీ కేబినెట్ విస్తరణ..16న ఢిల్లీకి సీఎం!

- Advertisement -