ప్రధాని మోదీతో సీఎం రేవంత్ భేటీ

6
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానితో రేవంత్ చర్చించారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 ప్రతిపాదనలకు సంబంధించి ప్రధానిని కలిసి మాట్లాడారు. వాటికి ఆమోదించాలని సీఎం రేవంత్ కోరారు.

బందర్ పోర్ట్ నుంచి హైదరాబాద్ డ్రైపోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవేకి మంజూరు చేయాలని కూడా విన్నవించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో సెమీ కండక్టర్ రంగానికి మద్దతు ఇవ్వాలంటూ కూడా కోరినట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణ ఐఎస్ఎం ప్రాజెక్ట్ కి కూడా ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రక్షణ రంగానికి సంబంధించిన ప్రాజెక్టులకి కూడా సహకారం అందించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని కలిసి విన్నవించినట్లు తెలుస్తోంది.

Also Read:వేశ్య లాగా చూశారు..మిస్ ఇంగ్లాండ్!

- Advertisement -