Congress:ఢిల్లీకి సీఎం రేవంత్

10
- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ నెల 24న ఢిల్లీకి వెళ్లనున్న రేవంత్…మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టులు, పీసీసీ అధ్యక్షుడి నియామకంపై అధిష్టానంతో చర్చించనున్నారు.

ఇప్పటికే నామినేటెడ్ పోస్టుల భర్తిపై ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోండగా పీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక మంత్రివర్గ విస్తరణలో ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఎవరిని అదృష్టం వరిస్తుందోనని కాంగ్రెస్ నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అలాగే గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన సీనియర్ నేతలకు ఎలాంటి పదవులు ఇవ్వాలి అన్నదానిపై తీవ్ర చర్చ జరుగుతోండగా సీఎం రేవంత్ హస్తిన పర్యటన తర్వాత పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Also Read:తెల్ల వెంట్రుక పీకితే..మరిన్నిపెరుగుతాయా?

- Advertisement -