వనదేవతలకు సీఎం రేవంత్ మొక్కులు

4
- Advertisement -

మేడారం సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్దకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా మొక్కులు చెల్లించారు. సీఎం రాక సందర్భంగా ఆదివాసీలు గిరిజన సంప్రదాయ నృత్యాలు, డప్పు చప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు. మేడారం జాతర వాతావరణం ఆధ్యాత్మికతతో పాటు పండుగ శోభను సంతరించుకుంది.

గద్దెల ప్రాంగణానికి చేరుకున్న ముఖ్యమంత్రి ..మేడారం ఆలయ పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం వనదేవతలైన సమ్మక్క–సారలమ్మలకు తొలిమొక్కులు చెల్లించారు. తన మనవడు రేయాన్ష్‌తో కలిసి తులాభారం నిర్వహించి, సమ్మక్క–సారలమ్మలకు బంగారం సమర్పించడం ఆకట్టుకుంది. ఈ సందర్భంగా సీఎం కుటుంబం తరఫున వనదేవతలకు మొక్కులు సమర్పించారు.

గద్దెల ప్రాంగణంలో సీఎం కుటుంబ సభ్యులకు, హాజరైన మంత్రులకు దేవతల ప్రసాదాన్ని అందజేశారు. అలాగే సంప్రదాయానుసారం చీరె సారెను మంత్రి సీతక్క బహుకరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సమ్మక్క–సారలమ్మలను దర్శించుకోవడం తనకు ఎంతో ఆధ్యాత్మిక శాంతిని ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వనదేవతల ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ శ్రేయస్సు కలగాలని ఆయన ఆకాంక్షించారు. మేడారం జాతర సందర్భంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తుందని తెలిపారు.

Also Read:థైరాయిడ్..బరువు పెరగడానికి కారణమా?

- Advertisement -